సూపర్ స్టార్ రజనికాంత్, ఏ.ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తోంది. రజిని నటించిన ‘2 .0 ‘ విడుదలకి సిద్ధం అవుతుండగా, మరో చిత్రం ‘పెట్ట’ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకొంది. ఈ చిత్రాల తర్వాత రజనికాంత్ చిత్రం మురుగదాస్ తోనే ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.విడుదలకి సిద్ధంగా ఉన్న విజయ్ ‘సర్కార్’ తర్వాత మురుగదాస్ తీయబోయే చిత్రం కూడా రజనికాంత్ తోనే అవుతుందని తెలుస్తోంది. సామజిక సమస్యలకి కమర్షియల్ అంశాలు జోడించి భారీ చిత్రాలు తీసే మురుగదాస్, ఆకాశమంత ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనికాంత్ కలయికలోని ఈ చిత్రం పట్టాలెక్కితే వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించడం ఖాయం.