అక్టోబర్ 21 న సాయంత్రం నందమూరి అభిమానులకు ఈ దసరా పండగకు నిజమైన అనుభూతిపొందారు నందమూరి కుటుంబం ఓకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు గ్రాండ్ ట్రీట్ ఇచ్చింది. అరవింద సమేత మూవీ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బాబాయ్..ఇద్దరు అబ్బాయ్‌లతో వేదికను పంచుకున్నారు. జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో కలిసి ఫంక్షన్‌లో సందడి చేశారు నందమూరి బాలక్రిష్ణ ఆ వేదికపై హరికృష్ణ లేని లోటును బాలయ్య తీర్చారని కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ అన్నారు. సినిమా విజయాన్ని అభిమానులతో పాటు బాబాయ్ పంచుకునేందుకే..ఆయన్ను ఆహ్వానించినట్లు తెలిపారు. కాగా, అంతకుముందు సినిమాలో నటించిన నటీనటులకు బాలయ్య మెమంటోలు అందించారు. జూ.ఎన్టీఆర్‌కు సైతం జ్ఞాపిక అందజేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా తారక్‌ను ఆయన అప్యాయంగా హత్తుకోవడం ఇరువురి భుజాలపై చేయి వేసి ఫోటోలు దిగడం చూస్తుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్..!

“మా అన్న హరికృష్ణ..టీడీపీ తొలి శ్రామికుడు. చైతన్య రథ సారధి. ఆయన మన మధ్య లేరంటే నమ్మలేకపోతున్నా. అన్నయ్య మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. చారిత్రక సినిమాలు, పోరాట చిత్రాలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు. అరవింద సమేత చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు అభినందనలు. మహిళ గొప్పతనాన్ని వివరించే సినిమా ఇది. నేను, తారక్ చేసే సినిమాలు ఎవరూ చేయలేరు. తివిక్రమ్ అద్భుతంగా సినిమాలు తీస్తారు.”
-నట సింహ నందమూరి బాలకృష్ణ

“ఈ ఆనంద సమయంలో నాన్న ఉంటే బాగుండేది. నాకు తెలిసి నాన్న ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తుంటారు. నాన్న లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్‌కు పాదాభివందనం చేస్తున్నా. ఈ సినిమా ఘన విజయం సాధించిన ఆనందాన్ని అభిమానులతో పాటు బాబాయ్‌తో కూడా పంచుకోవాలనుకున్నా.
అరవింద సమేత విజయానికి మీ ఆశీస్సులు అందజేసినందుకు ధన్యవాదాలు.”
-యంగ్ టైగర్ ఎన్టీఆర్

‘‘అరవింద సమేత ఎట్టా ఉన్నాదీ? వీర రాఘవ ఎట్టా సేశాడు?’’ అంటూ రాయలసీమ యాశలో మాట్లాడారు. ఈ సినిమాలో క్లైమేక్స్ తనకు హైలెట్ అనిపించిందని, ఫుల్ ఎమోషనల్ టచ్‌తో త్రివిక్రమ్ ఈ సినిమా తెరకెక్కించారని తెలిపారు. జగపతిబాబు తమకు ప్రతి నాయకుడు కాదని తమ కుటుంబ సభ్యుడని అన్నారు. ఆ పాత్రలో మరెవ్వరినీ ఊహించలేమని కొనియాడారు. బాలయ్య గురించి మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమాతో ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్న తమ బాబాయ్ బాలకృష్ణ తమ ఆనందాన్ని పంచుకోడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే, నాన్న లేని లోటు మాత్రం కనిపిస్తోందని, నాన్న ఇక్కడ ఉంటే బాగుంటుందని అనిపిస్తున్న తమకు బాబాయ్ ఆ లోటు తీర్చారని కళ్యాణ్ రామ్ భావోద్వేగంతో తెలిపారు.”
– డైనమిక్ హీరో కళ్యాణ్ రామ్