హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఈ తరహా విజయవంతమైన చిత్రాల వసూళ్ళు కూడా భారీగానే ఉంటున్నాయి. ఈ తరహా చిత్రాలతో టాప్ పోసిషన్ కి వెళ్లిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ చిత్రాల టాప్ హీరోయిన్లతో పోలిస్తే దక్షిణాదిన టాప్ హీరోయిన్లు తీసుకునే పారితోషికం తక్కువే. ఇక్కడ 1 ,2 కోట్ల పారితోషికం తీసుకుంటేనే ఆ తార గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది దక్షిణాదిన టాప్ హీరోయిన్ల లో ప్రముఖంగా ఉండే పాపులర్ హీరోయిన్ నయనతార ఒక కొత్త సినిమాకి ఏకంగా 4 .25 కోట్లు పారితోషికం తీసుకోనున్నట్టు సమాచారం. సౌత్ ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ కి ఇచ్చిన అత్యధిక పారితోషికం ఇదే. కాగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘కో కో కోకిల’, ‘ఇమాయక్క నొడిగళ్’ చిత్రాలు ఈ నెలలో విడుదల కానున్నాయి. ఆ చిత్రాల విజయం తో నయన్ రెమ్యూనరేషన్ ఇంకెంత పెరగనుందో ?