డిస్ట్రిబ్యూటర్ గా తన కేరియర్ ని స్టార్ట్ చేసి  ఎన్నో విజయవంతమైన హిట్ చిత్రాలను నైజాంలో పంపిణీ చేసిన అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ని స్థాపించి పలు సూపర్ హిట్ మూవీస్ ని నిర్మించారు.తాజాగా “సాక్ష్యం” చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్ స్టార్ పూజా హెగ్డే హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ నిర్మించిన భారీ చిత్రం “సాక్ష్యం”.ఈనెల 27 న ఈచిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.ఈ సందర్బంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా సంస్థ కార్యాలయం లో ప్రెస్ మీటీని ఏర్పాటు చేశారు.ఆయన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

* సాక్ష్యం మూవీ కాన్సెప్ట్ ఏంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలో మొదటి సారి పంచ భూతాల మీద వస్తున్న మూవీ ఇది. ఎవరైతే తప్పు చేసినపుడు ఎవరు చూడకుండా చేసాం, ఆనందంగా తప్పించుకున్నాం అనుకుంటారు. కానీ కర్మ సాక్షి అనేది ఒకటి ఉంటుందని, దానినుండి ఎవరు తప్పించుకోవడం కుదరదనేది మా సినిమా మెయిన్ కాన్సెప్ట్.

* ఆడియోకి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది?

అన్ని పాటలకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది.పాటల్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా రిచ్ గా చిత్రీకరించాం. సినిమాలో ఏదో పాటలు క్రియేట్ చేసి పెట్టినట్లు కాకుండా, కథ ప్రకారం, సంధర్భానుసారం గా వస్తాయి. పాటల్లో కనిపించే లొకేషన్లు అందరిని ఆకట్టుకుంటాయి.

* బడ్జెట్ ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది?

అవునండి, సినిమా కథ డిమాండ్ మేరకే ఖర్చు పెట్టాము. సినిమాలో కాశి సీన్స్ ఉంటే, వాటిని హైద్రాబాద్లో తీయడం కుదరదు, ఎంత కష్టమైనా అక్కడికే వెళ్లి తీయాలి. అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం పెరిగింది.కథకి అవసరమైన విధంగా ఖర్చు పెట్టాం తప్ప వెస్టేజ్ ఎక్కడా లేదు.కార్చుపెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపిస్తుంది.

*మరి హీరో మార్కెట్ ని మించి ఖర్చుపెట్టారని తెలిసింది?

ఇప్పుడు ప్రెసెంట్ జెనెరేషన్ మూవీస్ లో హీరో, హీరోయిన్లు కంటే కంటెంట్ మెయిన్ కింగ్ అండి. హీరో మార్కెట్ విషయం పక్కన పెడితే మంచి కంటెంట్ వున్న సినిమాకి ఈ మాత్రం ఖర్చు కరెక్ట్ అనిపించింది. పెద్ద హీరోలని పెట్టి సరైన కథ, కథనాలు లేకపోతే సినిమా చూడరు కదా..! అందుకే మా హీరో మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

* బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి?

మొదట ఈ సినిమా స్టోరీని శ్రీవాస్ గారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి చెప్పాకే వాళ్ళు..నేను నిర్మాత అయితే బాగుంటుందని నన్ను వచ్చి కలిశారు. కథ నచ్చి ఇమీడియట్ గా మూవీ స్టార్ట్ చేసి షూటింగ్ చేసాం.

*సినిమాలో గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉందా? ?

అది కథ ప్రకారం కొన్ని సిట్యుయేషన్లో గ్రాఫిక్స్ వాడడం జరిగింది. మరీ ఎక్కువ గ్రాఫికల్ వర్క్ లేదు. సిజి వర్క్ ముఖ్యమైన సన్నీ వేశాల్లో వాడాం.

హీరో క్యారక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది?

హీరో క్యారెక్టర్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. సినిమాలో అయన ఒక వీడియో గేమ్ డిజైనర్ గా నటిస్తున్నారు. అయన పాత్రా సినిమా పట్ల ముందుకు వెళ్లేకొద్దీ మంచి ఆసక్తిని కలిగిస్తుంది. శ్రీవాస్ తొలిసారి హీరోని చాలా డిఫరెంట్ గా చూపించారు. సాయి శ్రీనివాస్ గారు కూడా లవ్ సీన్స్ అప్పుడు చాలా స్టైలిష్ గా, అలానే ఫైట్ సీన్స్ అప్పుడు బాడీని బాగా బిల్డ్ అప్ చేసి నటించారు. ఆయన పాత్రలో వేరియేషన్స్ బాగా పలికించారు.ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మైల్ స్టోన్ మూవీ అవుతుంది.

* మీ బ్యానర్ కి ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుందని భావిస్తున్నారు?

డెఫినెట్ గా సాక్ష్యం చిత్రం మా బ్యానర్ లో గుర్తుండి పోయే చిత్రం అవుతుంది.అల్ రెడి ట్రైలర్స్ కి, సాంగ్స్ కి సుపర్బ్ రెస్పాన్స్ వస్తుంది.దీంతో సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ బాగా పెరిగాయి.సినిమా కూడా కొత్త కాన్సెప్ట్ కాబట్టి తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను.

* డైరెక్టర్ శ్రీవాస్ వర్కింగ్ స్టైల్ ఎలావుంది?

ఆయన ప్రీవియస్ మూవీ ‘డిక్టేటర్’ ఆ టైములో ఐదు సినిమాలతో పాటు విడుదలయింది. ఎందుకో ఆ సమయంలో ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. కానీ ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతోనే ఆయనతో చేయడం జరిగింది.హిట్ ప్లాప్ అనేది ఎవరికైనా కామన్.

సినిమాలో ముఖ్య పాత్రల గురించి చెప్పండి?

ఈ చిత్రంలో మొత్తం 48మంది ఆర్టిస్టులు నటించారు.ముఖ్యంగా జగపతిబాబు, శరత్ కుమార్, మీనా అశుతోష్ రానా, మెయిన్ క్యారెక్టర్స్ లో నటించారు.4గురు విలన్స్ వున్నారు, అలానే మిగిలిన పాత్రల్లో చాలా మంది ప్రముఖ నటీ నటులు నటించారు. తప్పకుండ వారందరు స్క్రీన్ పై గ్రాండ్ గా కనపడతారు.సినిమా అంతా గ్రాండ్ గా కలర్ ఫుల్ గా ఉంటుంది.

* డిస్ట్రిబ్యూటర్ గా ఏ సినిమాలు చేస్తున్నారు?

– బేసిగ్గా నేను డిస్ట్రిబ్యూటర్ ని కాబట్టి నైజామ్ లో కంపల్సరీగా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను.త్వరలో రెండు మూడు సినీమాలు ఉన్నాయి..

* నెక్స్ట్ మూవీ ఏంటి?

“గుడాచారి” సినిమా చాలా బాగా వచ్చింది.అచిత్రం ఆగస్ట్ 3న రిలీజ్ కి ప్లాం చేస్తున్నాం. చాలా కథలు వింటున్నాను.కొత్త డైరెక్టర్స్ న్యూ ఐడియాస్ తో వస్తే తప్పకుండా వారికి అవకాశాలు కల్పిస్తాం.అంటూ ఇంటర్వ్యూ ముగించారు.