యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విశ్వ‌రూపం 2`. ఆస్కార్ ఫిలిమ్స్ ప్రై.లి., రాజ్‌క‌మ‌ల్ ఫిలిమ్ ఇంట‌ర్నేష‌న్స్ ప‌తాకాల‌పై ఎస్‌.చంద్ర‌హాస‌న్‌, క‌మ‌ల్‌హాస‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్టు 10న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ఈ రోజు విడుద‌లైంది. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ హిందీ ట్రైల‌ర్‌ను, తెలుగులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త‌మిళంలో స్టార్ హీరోయిన్‌, క‌మ‌ల్‌హాస‌న్ త‌న‌య శృతిహాస‌న్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం విశేషం.

“మీపై ప్రేమ‌, గౌర‌వం ఎప్ప‌టికీ ఉంటాయి.. `విశ్వ‌రూపం 2` యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌“ అని ఆమిర్‌ఖాన్ ట్విట్ట‌ర్ ద్వారా క‌మ‌ల్ హాస‌న్ అండ్ టీమ్‌కి అభినంద‌నలు తెలిపారు.

“ఒక మ‌నిషి, ప‌లు ముఖాలు… సినిమాను ప్రేమించే క‌మ‌ల్‌హాస‌న్‌గారు న‌టించిన `విశ్వ‌రూపం 2` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం గ‌ర్వంగా భావిస్తున్నాను“ అంటూ యంగ్ టైగ‌ర్ ట్వీట్ చేశారు.

“`విశ్వ‌రూపం 2` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ట్రైల‌ర్ యాక్ష‌న్ ప్యాక్‌డ్‌గా ఉంది. అంద‌రికీ న‌చ్చుతుంద‌నుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్‌“ అని శృతి హాస‌న్ ట్వీట్ చేశారు.

గ్లోబల్ టెర్ర‌రిజమ్‌కు వ్య‌తిరేకంగా.. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమా రూపొందింది. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ సినిమా ఎప్పుడెప్పుడా అనేంత క్యూరియాసిటీ క‌లుగుతుంది. హిందీ, తెలుగు, త‌మిళంలో ఆగ‌స్ట్ 10న సినిమా విడుద‌ల కానుంది.