మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్‌ 1న ‘అభిమన్యుడు’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విశాల్ ఇంట‌ర్వ్యూ…

నా కెరీర్‌లోనే బెస్ట్‌ హిట్‌…
తమిళంలో ‘ఇరుంబు తిరై’ అనే పేరుతో నా అభిమన్యుడు సినిమా విడుదలైంది. నా కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ మూవీగా నిలిచింది. ప్రేకులకుందరూ సినిమాను యూనానిమస్‌ హిట్‌ చేశారు. తమిళంలో సినిమా ఘనవిజయం సాధించినట్లే.. తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సోషల్‌ మెసేజ్‌తో ఉన్న కమర్షియల్‌ ఫార్మేట్‌ మూవీ ఇది.

డిజిటల్‌ అనర్థాలే ప్రధానంగా…
– ఇప్పుడు అందరూ డిజిటల్‌ ఇండియా, ఆధార్‌ కార్డ్‌ అంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిణామాలుంటాయనేది కూడా ఈ సినిమాలో చూపించాం. డిజిటల్‌ ఇండియా అవసరమా? అనే ప్రశ్నతో సినిమాను ముగించాం. పార్ట్‌ 2 ఉంది.

ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు…
అర్జున్‌గారు ఈ సినిమాలో గ్రేడ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారు. నా సినిమా జీవితం ఆయనతోనే ప్రారంభమైంది. ఆయన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా స్టార్ట్‌ చేశాను. ఆయనతో కలిసి నటిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. యాదృచ్చికంగా జరిగింది. హీరో హీరోయిన్‌ కాంబినేషన్‌ సాధారణంగా చక్కగా కుదురుతుంది. అదే హీరోకి, విలన్‌కి మధ్య పోటీ చక్కగా కుదిరిందంటే మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ సినిమాలో అర్జున్‌గారు చెప్పే విషయాలే ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయి.

అదృష్టంగా భావిస్తున్నా…
– సమంతతో తొలిసారి నటించాను. అందరూ మిత్రన్‌ అనే డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మాం. యువన్‌శంకర్‌ రాజా సంగీతం, జార్జ్‌ విలియమ్స్‌ సినిమాటోగ్రఫీ సహా మంచి టీం కుదిరింది. మూడేళ్ల ముందు కథ చెప్పాడు… నచ్చింది. సినిమా అలా స్టార్ట్‌ అయ్యింది. ఆర్మీలో పనిచేసే వారికి రేషన్‌ కార్డ్‌, పాస్‌ బుక్‌ ఉండదని నాకు కూడా తెలియదు. ఈ సినిమా చేసే సమయంలో తెలిసింది. అదే విధంగా బ్యాంకులు రైతులకు లోన్‌ ఇవ్వరు. ఈ విషయాన్ని సినిమాలో డైలాగ్‌ రూపంలో పెట్టాం. ఇలాంటి సమయంలో అభిమన్యుడు వంటి సినిమా దొరకడం అదృష్టం.

తెలుగులో అందుకే లేట్‌ అయ్యింది…
– సినిమాను తెలుగులో కూడా సమాంతరం రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ మే 11న తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి తెలుగులో రిలీజ్‌ చేయలేకపోయాం.

హాలీవుడ్‌ తరహాలో…
సినిమా స్టార్ట్‌ కావడానికి ముందు రఫ్‌ ఎడిషన్‌ చేశాం. అందుకోసం హాలీవుడ్‌ తరహాలో టెస్ట్‌ ప్రివ్యూలు వేశాం. అందుకోసం సాధారణ ప్రేక్షకుల్లో కొంత మందిని సెలక్ట్‌ చేసి సినిమా చూపించాం. వాళ్లు సినిమా చూసి వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అలా 45 మందికి సినిమాను చూపించి.. వాళ్ల ఓపీనియన్‌ తీసుకుని నాలుగుసార్లు ఎడిట్‌ చేశాం. అలా చేయడం వల్ల సినిమా బాగా వచ్చింది. అలా చూపించడం వల్ల సినిమాలో ఏదైనా బాగోలేకపోతే సినిమాను ఎడిట్‌ చేసుకోవచ్చు. నా ‘పందెంకోడి 2’ సినిమాను రెండువారాల ముందుగానే చూపిస్తాను. మనం చేసేది బావుందని మనం అనుకుంటాం. కానీ బయటి నుండి ఓపినియన్స్‌ తీసుకోవడం వల్ల సినిమా ఏంటనేది తెలుస్తుంది.

కథ వినగానే …
– కథ వినగానే నా స్మార్ట్‌ ఫోన్‌ చూసుకున్నాను. అలాగే నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను కూడా చూడటం మానేశాను. డిజిటల్‌ ఇండియాకు వ్యతిరేకంగా నేను సినిమా చేయలేదు. కానీ.. మనం సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉన్నామా? అని ఆలోచించుకోండి అనే విషయాన్ని చెప్పడానికి ఈ సినిమా చేశాను.

శిక్షలు కఠినంగా ఉండాలి…
– సినిమా అనేది స్ట్రాంగ్‌ మీడియం. నా ఫేస్‌ వేల్యూని నేను ఉపయోగించుకుంటున్నాను. సినిమాను వేల మంది చూస్తారు. కాబట్టి సినిమాల ద్వారా అవేర్‌నెస్‌ కలిగించవచ్చు. దీని వల్ల నాకు తదుపరి సోషల్‌ అవేర్‌నెస్‌ సినిమాలు చేయమని ఆఫర్స్‌ వస్తున్నాయి. క్రైమ్‌కి బలమైన శిక్ష ఉంటే తప్పు చేసేవారు ఆలోచిస్తారు. ఉదాహరణకి రేప్‌కి మరణశిక్ష వేయాలి. అలా చేస్తేనే నేరాలు తగ్గుతాయి.

అలా చేస్తే కెరీర్‌ పోతుంది…
– నేను పొలిటికల్‌గా ఎదగాలనుకుని ఈ సినిమా చేయలేదు. అలా చేస్తే నా కెరియర్‌ పోతుంది. ఏదో కావాలని చేయలేదు. ఏదీ ఎక్స్‌పెక్ట్‌ చేయకుండా ఈ సినిమా చేశాను. మిత్రన్‌ కథ వినగానే షాకయ్యాను. నిజాన్ని ఇంతలా చెప్పడం కరెక్టా అని అడిగాను. సినిమా అలా స్టార్ట్‌ అయ్యింది.

‘టెంపర్‌’ రీమేక్‌ గురించి…
– ‘టెంపర్‌’ రీమేక్‌ను కొత్త స్క్రీన్‌ప్లేతో చేయబోతున్నాం. ఈ రీమేక్‌ను కూడా ఎ.ఆర్‌.మురుగదాస్‌గారి శిష్యుడే డైరెక్ట్‌ చేస్తాడు.