డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం ‘మెహబూబా’. కాగా, ‘చిరుగాలి చనువుగా చిటికెయ్య.. అది మనసుకు తగిలే హొయ్య’ అంటూ సాగే మూడో పాటను శనివారం విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్‌ రచించిన ఈ పాటకు సందీప్‌ చౌతా సంగీతాన్నందించగా అంబికా జోయ్స్‌ గానం చేశారు. మే 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.