డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్వీయ దర్శకత్వంలో తనయుడు ఆకాష్ పూరి హీరో గా, నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న ‘మెహబూబా’ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఇండో – పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా రూపొందబడిన ‘మెహబూబా’ ట్రైలర్ తో అంచనాలని మరింతగా పెంచేసింది. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే మ్యూజిక్ తో ‘మెహబూబా’ సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. మే 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి ‘మెహబూబా’ సిద్ధం అవుతోంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.