ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ నాడు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘కళారత్న ‘ పురస్కారం ఈ సంవత్సరం ప్రముఖ సంగీత దర్శకురాలు MM శ్రీలేఖ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా, అందుకున్నారు. 12వ యేటనే సినిమాలకు సంగీత దర్శకత్వం అందించడం మొదలుపెట్టిన శ్రీలేఖ, ఇంతవరకు 5 భాషలలో, 75 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఏకైక మహిళా సంగీతదర్శకురాలిగా రికార్డు సృష్టించారు. దాసరి నారాయణరావు గారి ‘నాన్నగారు ‘ సినిమాతో మొదలైన సంగీత ప్రస్థానం, మూవీ మొఘల్ రామానాయుడు గారి ‘తాజ్ మహల్ ‘, ధర్మ చక్రం (వెంకటేష్) వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు, ప్రేమించు లాంటి సందేశాత్మక చిత్రాలకు సంగీతం అందిస్తూ, మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా పేరు తెచ్చుకున్నారు. తన సంగీత దర్శకత్వంలో మొదటి పాట రచన చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కూడా ఇదే సంవత్సరం ‘కళారత్న ‘ పురస్కారం అందుకోవడం ఒక అదృష్టం అని MM శ్రీలేఖ అన్నారు.