నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’ యూత్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు సినిమా యూనిట్ కూడా యూత్ ని టార్గెట్ చేస్తూ, భారీగా ప్రమోషన్స్ జరుపుకుంటుంది. అయితే మరో 4 రోజుల్లో బాక్సాఫీస్ వార్ కి దిగనున్న ఈ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ఈ సినిమాకి వేరు….
చేసిన ప్రతి సినిమా కాన్ఫిడెంట్ గా చేస్తాం. సబ్జెక్ట్ పై పూర్తి స్థాయి నమ్మకం కుదిరితేనే చేస్తాం కానీ.. ఈ సినిమా విషయంలో వేరు, ఆల్ రెడీ హిట్టయిన సినిమా… నిరూపించుకున్న సినిమా…

అంత లేదనిపించింది…
U.S. లో ఉన్నపుడు చూశాను ‘కిరిక్ పార్టీ’. ఎవరో చూసి బావుందని చెప్తే చూశా. ఆ తరవాత ప్రొడ్యూసర్స్ ని కాంటాక్ట్ చేసి రైట్స్ కి ట్రై చేస్తే మరీ హెవీ రేట్ అనిపించింది. నాకెందుకో అంత అనవసరమనిపించింది. కానీ ఆ తరవాత మళ్ళీ మా వాళ్ళతో చూశా… నా విషయం పక్కన పెడితే అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. ఇక అప్పుడు డిసైడ్ అయ్యా.. ఎంతైనా తీసేసుకుందామని…

కాంపిటీషనే రీజన్…
‘కిరిక్ పార్టీ’ సక్సెస్ తరవాత నేనొక్కడినే కాదు, ఇంకా నలుగురైదుగురు కాంపిటీషన్ గా ఉన్నారు. వాళ్ళతో సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉండగానే నేను ఫైనలైజ్ చేసుకున్నాను…

‘శివ’ సినిమా షేడ్స్ ఉంటాయి…
నాకు ఎప్పటికైనా ‘శివ’ లాంటి సినిమా చేయాలనేది లైఫ్ టైమ్ ఆంబిషన్. ఈ సినిమాలో కూడా చాలా చోట్ల ‘శివ’ షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్ పాలిటిక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కి చాలా కనెక్ట్ అయ్యాను…

అందుకే వద్దన్నాను…
‘కిరాక్ పార్టీ’ రాజు సుందరం డైరెక్షన్ లో తెరకెక్కాల్సింది… కానీ ఆయన బైలింగ్వల్ చేద్దామన్నాడు. బైలింగ్వల్ అనగానే అంతలా ఫోకస్ చేయలేమోననిపించి వద్దనుకున్నాను. అప్పటికే శరణ్, ఈ సినిమా ప్రాజెక్ట్ కి పని చేస్తున్నాడు. అంతలో చందూ మొండేటి, సుదీర్ వర్మలిద్దరూ శరణ్ నే డైరెక్టర్ గా రికమెండ్ చేశారు… సపోర్ట్ చేశారు… చాలా హ్యాప్పీ…

అవే చూసుకుంటాను…
నేను ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లోనే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాను. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో.. ఒక్కోసారి ఒక సీన్ లో డైలాగ్స్ కి, నెక్స్ట్ సీన్ లో డైలాగ్స్ కి అసలు పొంతన లేకుండా పోతుంటుంది. అలాంటి తప్పులు దొర్లితే చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు చూసుకుంటాను తప్ప సినిమా సెట్స్ పైకి వచ్చాక ఏ మాత్రం ఇన్వాల్వ్ కాను…

కనిపించకుండా వెళ్ళిపోతాను…
నా సినిమా ఫ్లాపయితే ఇమ్మీడియట్ గా U.S. కి వెళ్ళిపోతాను. సినిమా రిజల్ట్ ఒక రోజు ముందు తెలిసినా, రిలీజ్ తరవాత తెలిసినా కనీసం ప్రెస్ మీట్ కి కూడా రాను…. నేను ఫెయిల్యూర్ ని ఫేస్ చేయలేను…

‘రాజుగాడు’ రిలీజ్ డేట్…
‘రాజుగాడు’ రిలీజ్ డేట్ ఇంకా ఏమీ అనుకోలేదు… 18th కి టీజర్ రిలీజ్ చేస్తున్నాం. మ్యాగ్జిమం సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తాం… సినిమా చాలా బాగా వస్తుంది.

మహేష్ బాబుతో సినిమా…
మహేష్ బాబు తో సినిమా చేశామంటే అది కంపల్సరీ గా హిట్టవ్వాల్సిందే… అలాంటి సినిమా చేస్తాం. మాకు ఆయనతో చాలా మంచి రిలేషన్ షిప్ ఉంది…

ఇమోషనల్ సీన్స్ హైలెట్…
‘కిర్రాక్ పార్టీ’ లాస్ట్ 25 మినట్స్ లో ఉండే ఇమోషనల్ సీన్స్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తాయి. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు రావడం ఖాయం… దాంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ కి కూడా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సినిమాలో ఉండే ప్రతి సీన్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది.