సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. సోమవారం ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ `చ‌మ‌కు చ‌మ‌కు చామ్‌…` ను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి `కొండ‌వీటి దొంగ‌` చిత్రంలోని `చ‌మకు చ‌మ‌కు చామ్‌` సాంగ్‌కు ఇది రీమేక్ సాంగ్‌. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హించారు. రీసెంట్ విడుద‌ల చేసిన ఈ సినిమా టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే రీసెంట్‌గా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేసిన `లెట్స్ డు..` సాంగ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

`చ‌మకు చ‌మ‌కు చామ్‌` సాంగ్‌