‘బాహుబలి’ 1,2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ సాహోకి దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సాహో ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. గతంలో బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ లుక్ ని సైతం రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగానే విడుదల చేయడం జరిగింది. అదే ఆనవాయితిని కొనసాగిస్తూ మరోసారి సాహో ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్.

ఫేస్ కి మాస్క్ తో ఉన్న ప్రభాస్ స్టిల్ ని సాహో ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ లుక్ ప్రభాస్ అభిమానుల్నే కాకుండా సామాన్య సినీ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకోవడమే కాదు వారిలో మరింత ఉత్కంఠని పెంచింది. అంతేకాదు ప్రభాస్ సాహోలో ఓ అల్ట్రామోడ్రన్ గెటెప్ లో కనిపించబోతున్నాడనే సంకేతాలు ఈ ఫస్ట్ లుక్ ద్వారా అందుతున్నాయి. ఏప్రిల్ లో సాహో ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ జరగడం ఆ తరువాత బాహుబలి 2తో పాటు సాహో టీజర్ ని విడుదల చేయడం, ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఈ చిత్రం పై భారీగా అంచనాలు పెంచాయి. అందుకు తగ్గట్లుగానే యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోదులు ఏ విషయంలో రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. సాహోలో ప్రభాస్ తో జోడి కట్టే లక్కీ బ్యూటీ ఎవరా అనే ఉత్కంఠకి తెర దించుతూ ఇటీవలే ఈ చిత్ర బృందం బాలీవుడ్ బబ్లీ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ సాహోతో తెలుగు చిత్ర సీమకు పరిచయం కాబోతుంది. ఇటీవలే సాహో టీమ్ హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.

బ్యానర్ – యువి క్రియేషన్స్
దర్శకుడు – సుజీత్
నిర్మాతలు – వంశీ-ప్రమోద్
సంగీతం – శంకర్-ఎహసాన్-లాయ్
సినిమాటోగ్రాఫర్ – మధి
ఆర్ట్ డైరెక్టర్ – సాబు సిరీల్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్