సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రంలోని రెండో పాటను సోమవారం విడుదల చేశారు. ‘ఏ పుచ్చకాయ.. పుచ్చకాయ.. నీ పెదవి తీపి నాకిచ్చుకోవే.. ఇచ్చుకోవే.. నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి.. నా గుండెకొచ్చి గుచ్చుకోవే…. హాలీ హాలీ.. ఏ హాలీ హాలీ హాలిబి..’ అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పాట మేకింగ్‌ కూడా వుండడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘బూమ్‌ బూమ్‌’కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాటలకు హేరిస్‌ జయరాజ్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ని అందించారు. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాపై వున్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.