హారర్ థ్రిల్లర్ “షాలిని’ చిత్రం ప్లాటినం డిస్క్, సెప్టెంబర్ ఒకటి న విడుదల

0
309

స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకం ఫై ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్ లు గా పార్సిల్ ఫెమ్ షెరాజ్ దర్శకత్వంలో”లయన్” సాయి వెంకట్ సమర్పణలో పి. వి. సత్యనారాయణ నిర్మించిన హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ చిత్రం”షాలిని’ ఇటీవల ఈ చిత్రం యొక్క పాటలు శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం తో ..సోమవారం సాయంత్రం ప్రసాద్ లాబ్ లో. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ని రంగ రంగ వైభవంగా చిత్ర యూనిట్ సభ్యులు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్,తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సినీ నటి కవిత, నిర్మాత.. లయన్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్.. మోహన్ గౌడ్, సెన్సార్ బోర్డ్ మెంబర్.. అట్లూరి రామకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎ. వి. వి .సురేష్ మొదలగు వారు హాజరయ్యారు.

ప్లాటినం డిస్క్ షీల్డ్ లను ప్రతాని రామకృష్ణ గౌడ్,కవిత చేతులు మీదగా చిత్ర యూనిట్ సబ్యులకు అందచేశారు.

రామకృష్ణ గౌడ్ మాటలాడుతూ… షెరాజ్ ను అభినందిస్తున్నాను. మేకింగ్ చూసాను చాలా బాగుంది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలాగా ఉంది .సాయి వెంకట్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నాడు .సాయి వెంకట్ కి , ప్రొడ్యూసర్, సతన్నారాయణకు మంచి లాభాలు రావాలి . ఖచ్చితంగా నా తరుపున మెయిన్ సెంటర్లలో థియేటర్లు ఇప్పిస్తానని అన్నారు

కవిత మాటలాడుతూ.. షెరాజ్ ను అభినందిస్తున్నాను.మంచి కథ తీసుకున్నారు ఇది మంచి సినిమా అవుతుంది. న్యూ జనరేషన్ కి మా సపోర్ట్ ఉంటుంది.పాటలు విన్నాను చాలా బాగున్నాయి మ్యూజిక్ చాలబాగుంది నవనీత్ మంచి భవిష్యత్తు ఉంది.ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్ లందరికి శుభాకాంక్షలు నిర్మాతకు మంచి లాభాలు రావాలన్నారు.

సమర్పకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ.. సినిమాకు షాలిని పేరు చాల బాగుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి A సర్టిఫికెట్ రావడం జరిగింది. ఇందులో హార్రర్ ఎక్కువగా ఉండడం తో సెన్సార్ వాళ్ళు A సర్టిఫికెట్ అన్నారు దాంతో మేము రీజనల్ కు వెళ్ళాము అక్కడ జీవిత రాజశేఖర్ గారు మాకు సహాయం అందించారు. ఇక ఈ చిత్ర పాటల విషయానికి వస్తే అల్రెడీ శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు లక్షల వ్యుస్ ను పొందింది. టైటిల్ సాఫ్ట్ అయినా సినిమా మాత్రం భయపెడుతుంది.

దర్శకుడు షెరాజ్ మాట్లాడుతూ…నిర్మాత సత్యనారాయణ తో ఇది నా రెండో సినిమా.ఈ కథ చెప్పిన వెంటనే ఒకే చెప్పారు . మా సినిమా కు ‘A’ సరిఫికెట్ రావడం ఎందుకంటే హార్రర్ ఎక్కువగా ఉండటం వలనే అంటే హర్రర్ ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది విజయం సాధిస్తుంది కనుక. డిఫరెంట్ మూవీ ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది.నేను ఆల్రెడీ హీరో గా చేసాను కాబట్టి ఈ సినిమా చేస్తుండగా నాకు మూడు సినిమాల్లో హీరో అవకాశాలు వచ్చాయి . బూచోడు సినిమాలో హీరోగా, మరో భక్తి రస చిత్రం లో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ లు చేస్తున్నాను అని అన్నారు .

చిత్ర హీరో ఆమోగ్ దేశపతి మాట్లాడుతూ… ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థాంక్స్ ఈసినిమా చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ… షెరాజ్ తో నాకు రెండో సినిమా ఈ కథ చెప్పిన వేటనే ఒక చేసాను. పిలవగానే ఈ పంక్షన్ కి వచ్చినందుకు అందరికి కృతఙ్ఞతలు ఈ సినిమాను సెప్టెంబర్ ఒకటి న విడుదల చేస్తున్నాము అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here