హీరో సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.4గా సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవంలో రచయితలకే అధిక ప్రాధాన్యమిచ్చారు దర్శకుడు వి.వి.వినాయక్‌. ఈ చిత్రం ముహూర్తం షాట్‌కు సీనియర్‌ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుతో క్లాప్‌ ఇప్పించారు. అలాగే కెమెరా స్విచ్చాన్‌ మరో సీనియర్‌ రచయిత సత్యానంద్‌తో చేయించారు. ఫస్ట్‌ షాట్‌ను ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన శివ ఆకులతో డైరెక్ట్‌ చేయించారు. ఒక భారీ సినిమా ఇలా రచయితల చేతులమీదుగా ప్రారంభం కావడం చాలా అరుదు. రచయితలు సినిమా ప్రారంభోత్సవంలో పాలు పంచుకునేలా చేసి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్న దర్శకుడు వి.వి.వినాయక్‌ను అందరూ అభినందిస్తున్నారు.