అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `తారామ‌ణి`. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వెంక‌టేష్ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా..

డి.వి.సినీ క్రియేష‌న్స్ అధినేత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ – “ట్ర‌యాంగుల‌ర్ ల‌వ్‌స్టోరీ. సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ స‌మ‌పాళ్లలో ఉంటాయి. ప్ర‌తి స‌న్నివేశం మ‌న‌సును హ‌త్తుకునేలా ఉంటుంది. ప్ర‌స్తుతం స‌మాజంలో స్త్రీల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల నేపథ్యంలో సినిమా సాగుతుంది. ప్ర‌స్తుతం యువ‌త టెక్నాల‌జీ మాయ‌లో ప‌డి ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఎలాంటి ప్ర‌లోభాల‌కు లోన‌వుతున్నారు. ప‌లితంగా వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటున్నార‌నే అంశాలు కూడా సినిమాలో ఉంటాయి. య‌వ‌త‌ను మెప్పించే అంశాల‌న్నీ ఈ సినిమాలో ఉంటాయి. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త‌మిళంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, పాట‌ల‌ను సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌, పాట‌లకు ఆడియెన్స్ నుండి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆగ‌స్టు నెల‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. మా బ్యాన‌ర్‌కు చాలా మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంది“ అన్నారు.