శ్రీ వేంకటేశ్వర సూపర్‌ మూవీస్‌ బ్యానర్‌పై ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ వంటి సెన్సేషనల్‌ చిత్రాన్ని రూపొందించిన శేఖర్‌ సూరి దర్శకత్వంలో ఎ. వెంకటేష్‌ (ఛాంప్‌), శేఖర్ సూరి, బి. ఆర్. రత్నమాల రెడ్డి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘డా||చక్రవర్తి’. రిషి, సోనియామాన్‌ హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ కార్యక్రమం లో రిషి, సోనియా మాన్, గిరీష్ సహదేవ్, అనిరుద్ సింగ్, లీనా, వంశీ, అశోక్, విజయ్ కురాకుల, దర్శకుడు శేఖర్ సూరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్‌ సూరి మాట్లాడుతూ “ఒక యదార్థ సంఘటన ఆధారంతో.. చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘డా||చక్రవర్తి’. నేను కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామినే. ఈ చిత్ర రూపకల్పన కోసం ఆర్టిస్ట్స్ ఎంతగానో సహకరించారు. రిషి, సోనియా, లీనా అలాగే నటుడు అశోక్ కుమార్ గారి అబ్బాయి వంశీ వంటి వారంతా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో చిత్రాన్ని తెరకెక్కించాము. 2015 లో బాంబే లో జరిగిన యదార్థగాధ ఇది. ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా ఉంటుంది. విజయ్‌ కురాకుల మ్యూజిక్‌ ఈ చిత్రానికి పెద్ద హైలైట్‌ అవుతుంది. అల్రెడీ విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. జూలై 14 న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము.. ప్రేక్షకులు మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ కార్యక్రమం లో హాజరైన అందరూ..ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.

రిషి, సోనియామాన్‌, గిరీష్‌ సహదేవ, లీనా, వంశీ, అశోక్‌కుమార్‌, కుమారన్‌, చైతన్య, పూజ, లావణ్య, పోకిరి విజయ్‌, అనిరుధ్‌ సింగ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ కురాకుల, కెమెరా: రాజేందర్‌, ఎఫెక్ట్స్‌: ఇతిరాజ్‌, డైలాగ్స్‌: చిట్టి శర్మ, మిక్సింగ్‌: రంగరాజు; ఎడిటింగ్‌: తిరుపతి రెడ్డి, నిర్మాతలు: ఎ. వెంకటేష్‌ (ఛాంప్‌), శేఖర్ సూరి, బి. ఆర్. రత్నమాల రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శేఖర్‌ సూరి.