యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రం టీజర్‌ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. కొత్త లుక్‌తో నితిన్‌, విలన్‌గా ఓ కొత్త గెటప్‌లో అర్జున్‌ కనిపించే ఈ టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్స్‌ చాలా కొత్తగా అనిపిస్తాయి. ‘కోట్ల మంది సైనికులు సరిపోలేదు. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదు. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వథ్థామ హత: కుంజర:’… బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ డైలాగ్‌తోపాటు ఛేజ్‌, యాక్షన్‌ సీన్‌ డిఫరెంట్‌గా వున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.