ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై ‘మామ్‌’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. నాలుగు భాషల్లోనూ శ్రీదేవి తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సెంటిమెంట్‌, అందర్నీ ఆలోచింపజేసే మాటలు ఈ చిత్రంలో వున్నాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ అందించిన వీనుల విందైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణలు. ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ వంటి విభిన్న చిత్రంతో నటిగా అందరి ప్రశంసలు అందుకున్న శ్రీదేవి ‘మామ్‌’ చిత్రంలో మరో అద్భుతమైన పాత్రతో మంచి అనుభూతిని కలిగించేందుకు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మామ్‌ ట్రైలర్‌

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌