కుమారి 21 ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.