నూతన దర్శకుడు వశిష్ట పారుపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించ నున్నారు. ఈ చిత్రం తో అశ్విన్ కధానాయకుడి గా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  హైదరాబాద్ మరియు అమెరికా లొ చిత్రీకరణ చేయనున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే. వెంకటేశ్ మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. విందా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. వంశి-హరి ఈ చిత్రానికి అద్బుతమైన సంగీతం సమకురుస్తునారు. ఈ చిత్రానికి సంబంధించిన  కాస్టింగ్ కాల్ పోస్టర్ ఉగాదికి విడుదల అయ్యి అనూహ్య స్పందన పొందింది. ఇటివలే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని తదుపరి షెడ్యూల్ అమెరికా లొ చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనిష్ కురువిల్లా మరియు అమృతం ఫేమ్ శివన్నారాయణ నరిపెద్ది ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషించనున్నారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు.  నిర్మాణ విలువల్లో ఎలాంటి లోటు లేకుండా లోకి ఫిలిమ్స్ వారు ప్రతిష్టాత్మకం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం అంటున్నారు చిత్ర నిర్మాత సుదేష్. న్యూయార్క్ మరియు మియామీ లో తదుపరి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రానికి కధ, కధనం,మాటలు దర్శకుడు వశిష్ట పారుపల్లి అందించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం వంశీ – హరి అందిస్తుండగా, సాహిత్యం సర్వ సి. హెచ్ అందిస్తున్నారు.