క‌ళా త‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ ఇటీవ‌ల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు ఇప్ప‌టికే ఆయ‌న్ను స్వ‌యంగా కలిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా `మా` ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కూడా ఎంపీ ముర‌ళీ మోహ‌న్ స‌మ‌క్షంలో విశ్వ‌నాథ్ స్వ‌గృహంలో క‌లిసారు.అనంత‌రం ముర‌ళీ మోహ‌న్, `మా` అధ్య‌క్షుడు శివాజీరాజా, శ్రీకాంత్ ఆయ‌న్ను స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ` షూటింగ్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల విశ్వ‌నాధ్ గారిని క‌ల‌వ‌డం ఆల‌స్య‌మైంది. నిన్న‌నే ఆయ‌న్ను క‌లిసాను. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, ఈసీ మెంబ‌ర్ సురేష్ కొండేటి సత్కార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.