ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. అల్రెడి విడుద‌లైన పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు`గా న‌టిస్తున్న ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సినిమాకు వ‌న్ ఆఫ్ ది హైలైట్ కానుంది. సోష‌ల్ మీడియాలో, ఎఫ్‌.ఎం. స్టేష‌న్స్‌లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈరోజు నుండి ఒక్కొక్క సాంగ్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కామెడి, ల‌వ్‌, యాక్ష‌న్‌, సస్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ స‌మ‌పాళ్ళ‌లో ఉండేలా ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్ డిఫ‌రెంట్ స్క్రిప్ట్‌తో తెర‌కెక్కించారు. స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది.

రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

దెబ్బకి పోయే పోయే సాంగ్ కోసం క్లిక్ చేయండి