తెలుగు సినిమా స్టామినాను ప్ర‌పంచానికి తెలియ‌జేసిన విజువ‌ల్ వండ‌ర్ `బాహుబ‌లి 2`. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా ద‌గ్గుబాటి తారాగణంగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘బాహుబలి2`. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించిన ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక ఆదివారం హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జ‌రిగింది.బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ..

బాహుబ‌లిలో చిన్నభాగం కావ‌డం అదృష్టం

బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ మాట్లాడుతూ..ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో గొప్ప ప్లాట్‌ఫాం అయిన బాహుబ‌లి స్టేజ్‌పై నిలుచుని ఉండ‌టం గొప్ప‌గా అనిపిస్తుంది. బాహుబ‌లి అనే సినిమా ఇండియ‌న్ సినిమాల్లో గ‌ర్వంగా నిలిచిపోయే సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేని సినిమా. 1960లో ముగ‌ల్ ఎ ఆజామ్ అనే సినిమా త‌ర్వాత..అంటే 67 ఏళ్ళ త‌ర్వాత ముగ‌ల్ ఎ ఆజామ్ వంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన సినిమా బాహుబ‌లి. రాజ‌మౌళి గ్లోబెల్ ఫిలిం మూవీ మేక‌ర్‌. స్పీల్ బ‌ర్గ్, జేమ్స్ కామెరూన్‌, క్రిస్ట‌ఫ‌ర్ నోల‌న్ వంటి గొప్ప హాలీవుడ్ ద‌ర్శ‌కుల స‌ర‌స‌న నిలిచే గొప్ప ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. త‌ను సాధించిన దానితో పోల్చితే నేను ప‌దిశాతం కూడా సాధించ‌లేద‌నిపిస్తుంది. బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్ ఇక్క‌డితో ముగియ‌దు. ఈ జ‌ర్నీ ఇక్క‌డితోనే ప్రారంభం. వేల మంది మూవీ మేక‌ర్స్‌ను ఇన్‌స్పైర్ చేసే చిత్ర‌మిది. శోభు, ప్ర‌సాద్ వంటి నిర్మాత‌లు యోధుల్లాగా, వీరుల్లాగా ఈ సినిమాను ధైర్యం చేశారు. ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల‌నే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న సినిమా. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ ఈ బాహుబ‌లి చిత్రానిదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాలో చిన్న భాగం అయినందుకు ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. ప్ర‌భాస్‌, రానా, త‌మ‌న్నా, అనుష్క స‌హా అంద‌రూ ఎంతో డేడికేష‌న్‌తో వ‌ర్క్ చేశారు. హిందీ న‌టీన‌టుల‌కు వీరిని చూపించి అస‌లైన డేడికేష‌న్ అంటే ఇదేన‌ని చెప్పాల‌నుకుంటున్నాను. ఏప్రిల్ 28న హిస్టారిక్ ఈవెంట్‌లా విడుద‌ల కానున్న బాహుబ‌లి చిత్రంలో మేం కూడా చిన్న భాగం కావ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాం అని చెప్పారు.

అభిమానుల కోసం ఏడాదికి రెండు సినిమాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తా

ప్ర‌భాస్ మాట్లాడుతూ…బాహుబ‌లి సినిమాలో మొద‌టి పార్ట్ రెండున్న‌రేళ్ళు రెండో పార్ట్ కోసం రెండేళ్ళు అభిమానులు, ప్రేక్ష‌కులు వెయిట్ చేశారు. ఇక‌పై అభిమానుల కోస‌మైనా ఏడాదికి రెండు సినిమాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. . హిందీలో బాహుబ‌లి సినిమా ఇంత పెద్ద రేంజ్‌లో రీచ్ కావ‌డానికి కార‌ణం అనిల్ టాడ‌ని, క‌రణ్‌జోహార్‌గారే కార‌ణం. ఆయ‌న పేరు ఉండ‌టం వ‌ల్ల మ‌న తెలుగు సినిమాకు నార్త్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. స‌మ‌యాభావం వ‌ల్ల ఈ సినిమాలో నాతో పాటు వ‌ర్క్ చేసిన ఆర్టిస్ట్స్‌, టెక్నిషియ‌న్స్ అంద‌రికీ థాంక్స్‌. నువ్వు నా ప‌క్క‌నున్నంత వ‌ర‌కు న‌న్ను చంపే మ‌గాడు ఇంకా పుట్ట‌లేదు మామా.., వాడి త‌ప్పు కాబ‌ట్టే వాడి త‌ల తెగింది అనే డైలాగ్స్ చెప్పి ప్ర‌భాస్ ప్ర‌స‌గం ముగించారు.

బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్‌కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ చూసి ద‌ర్శ‌కుడుగా ప్రౌడ్‌గా ఫీల‌య్యా

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ… మా సినిమాకు, మాకు వెన్నుద‌న్నుగా నిల‌బ‌డ్డ రామోజీరావుగారికి, పోలీస్ క‌మీష‌న‌ర్ మ‌హేష్ భ‌గావత్‌గారికి, హ‌య‌త్ న‌గ‌ర్ పోలీసులంద‌రికీ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు థాంక్స్‌. కృష్ణంరాజుగారికి, రాఘ‌వేంద్ర‌రావుగారికి, నా డైరెక్ష‌న్ టీంకు థాంక్స్‌. శంక‌ర్‌, ప్రేమ్‌ర‌క్షిత్‌, ప్ర‌తీక్‌, సాల్మ‌న్ ఫైట్‌ మాస్ట‌ర్‌, కృష్ణ‌, తమ్మిరాజు, మ‌కుట టీం, దేవిక అందరికీ థాంక్స్‌. ఇలా పేరు పేరునా అంద‌రికీ థాంక్స్‌. ఇన్ని సంవ‌త్స‌రాలు ఇంత క‌ష్ట‌ప‌డి చేసి, ఈస్టేజ్‌పై నిలుచున్నాం. అంటే ఇది స్టేజ్ కాదు. ఎన్నో వంద‌ల మంది వ‌ర్క‌ర్స్ భుజాల‌పై నిలుచుని ఉన్నాం.. అలాగే క‌ళ్యాణ్ అన్న‌య్య నాకు ఎంతో ఎన‌ర్జి ఇచ్చారు. సెంథిల్‌కుమార్ నాతో పాటు ఐదేళ్ళ పాటు ట్రావెల్ చేశారు. సాబుశిరిల్ గారికి థాంక్స్‌. క‌మ‌ల్ క‌న్న‌న్ విఎఫెక్స్ ప‌రంగా నాకు టీచ‌ర్‌లా ప్ర‌వ‌ర్తించి నాకు చాలా విష‌యాలు నేర్పించారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్స్ ర‌మ‌, ప్ర‌శాంతిల‌కు థాంక్స్‌. కార్తీకేయ నా సెకండ్ యూనిట్లో చాలా సీన్స్‌ను డైరెక్ట్ చేశాడు. బాహుబ‌లి2 సినిమా ఫైన‌ల్ షూటింగ్‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల నేను ట్రైల‌ర్ ఎలా చేయాలో కూడా బాహుబ‌లి2కు చెప్ప‌లేదు. కానీ ట్రైల‌ర్ అద్భుతంగా క‌ట్ చేశాడు. పెద్ద‌న్నఅద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయ‌న‌కు థాంక్స్‌. ఆయ‌న‌ సినిమాకే కాదు, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో టెక్నిషియ‌న్స్‌కు త‌గ్గ‌ట్టు కూడా లిరిక్స్ రాయించారు మంచి ట్యూన్స్‌తో మ్యూజిక్ చేశారు. అందుకు పెద్ద‌న్న‌కు థాంక్స్‌. ప్ర‌భాస్ గురించి చెప్పాలంటే..నేను క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూ, నాకు న‌చ్చిన విధంగా సినిమాలు తీశాను. హీరోయిజం ఎలా ఉండాల‌ని ఆలోచించుకుంటూ, నెక్ట్స్ లెవ‌ల్లో ఆలోచిస్తూ, సినిమాలు చేశాను. బాహుబ‌లిలో ప్ర‌భాస్‌కు ఏమిచ్చాన‌ని ప్ర‌శ్నించుకున్నప్పుడు, ముంబైలో ట్రైల‌ర్ రిలీజ్ వెళ్ళినప్పుడు ముంబై మీడియా, ప్రెస్‌వాళ్లు అరుస్తున్నారు. అది చూడ‌గానే క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల‌య్యాను“ అన్నారు

బాహుబ‌లి ..తెలుగు సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ళింది

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ…విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, కీర‌వాణి స‌హా ఫ్యామిలీ అంద‌రూ మాకెంతో మంచి మిత్రులు. బాహుబ‌లి సినిమా ప్ర‌పంచంలో తెలుగు సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్ళింది. స్పీల్‌బ‌ర్గ్‌గారిని ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ గురించి అడగ్గా ముందు ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదు. ఆయ‌న్ను ప‌దే ప‌దే అడగ్గా ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో ఒకే క‌థ‌తో వేల సినిమాలు ఎలా తీస్తున్నారో అర్థం కావ‌డం లేదు అన్నాడ‌ట‌. ఇప్పుడు ఆయ‌న్ను బాహుబ‌లి సినిమా చూసిన త‌ర్వాత మాట్లాడ‌మ‌ని చెప్పాల‌నుంది. రాజ‌మౌళిని స్పీల్‌బ‌ర్గ్ కంటే గొప్ప‌వాడ‌ని నేను అన‌ను కానీ అంత కంటే గొప్ప‌వాడు అవుతాడ‌ని అంటాను. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇంత గొప్ప డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్, టెక్నిషియ‌న్స్‌, ఆర్టిస్ట్స్ ఉన్నార‌ని నిరూపించ‌డం గ‌ర్వంగా ఉంది. న‌టుడిగా నాకు ఇది 50 వ సంవ‌త్స‌రం. సాధార‌ణంగా నేను రాజ‌కీయ నాయ‌కుల‌ను క‌లిసిన‌ప్పుడు సినిమా ఇండ‌స్ట్రీ గురించి చాలా లోకువ‌గా మాట్లాడేవారు. ఇప్పుడు నేను ఎక్క‌డికి వెళుతున్నా..బాహుబ‌లి సినిమా గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన‌ప్పుడు మోదిజీ మాట్లాడుతూ..నేను బాహుబ‌లి సినిమాలో క‌ట్ట‌ప్పలాంటి వాడిని. ప్ర‌ధాని మంత్రి అనే కుర్చిని కాపాడ‌టానికి క‌ట‌ప్ప‌లా త్యాగం చేస్తాన‌ని అన్నారు. సినిమా ఇండ‌స్ట్రీ గొప్ప‌త‌నం ఈ బాహుబ‌లి సినిమాతో అంద‌రికీ తెలిసింది. ప్ర‌భాస్ న‌మ్మ‌కంతో చేసిన సినిమా ఇది. రాజ‌మౌళి ప్ర‌తి ఫ్రేమ్ ద‌గ్గ‌రుండి కేర్ తీసుకుని చేశారు అని తెలిపారు..

ఇది బాహుబ‌లినామ సంవ‌త్స‌రం

కె.రాఘవేంద్ర‌రావు మాట్లాడుతూ ..మార్చి 29న ఉగాది అయితే ఏప్రిల్ 28న అస‌లైన మ‌రో ఉగాది ఉండ‌బోతుంది. దాన్ని బాహుబ‌లినామ సంవ‌త్స‌రం అంటారు. బాహుబ‌లి సినిమాలో అంద‌రూ గొప్ప‌గా న‌టించారు. గొప్ప‌గా తీశారు. బాహుబ‌లి గొప్ప చిత్రం కావ‌డానికి..నిర్మాత‌ల ధైర్య‌మ‌ని చెప్ప‌నా, రాజ‌మౌళి ఇమాజినేష‌న్ అని చెప్ప‌నా, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారి క‌థ అని చెప్ప‌నా, సెంథిల్ సినిమాటోగ్ర‌ఫీ అని చెప్పనా, ప్ర‌భాస్‌, రానా మ‌ధ్య యుద్ధం అని చెప్ప‌నా, క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌ని చెప్పనా, ఆర్ట్ డైరెక్ష‌న్ గొప్ప‌ది అని చెప్ప‌నా..అంద‌రూ బాగా చేశారు. ర‌మ్య‌కృష్ణ‌, వ‌ల్లీ, ర‌మ లేకుంటే బాహుబ‌లికి అంత స‌పోర్ట్ ఉండేది కాదు. ఈ విష‌యాన్ని ప్ర‌భాస్ నాకెప్పుడూ చెప్పేవాడు. ప్ర‌భాస్ నాన్న‌గారు నాకు అత్యంత ఆప్తుడు, నా సోద‌రుడు కంటే ఎక్కువ‌. ఆయ‌న ప్ర‌భాస్ విజ‌యాన్ని చూసి ఆనందిస్తారు. టీంకు ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

బాహుబ‌లి..అంద‌రూ ఐదేళ్ళ ప్యాష‌న్‌తో చేసిన సినిమా

శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ..ఈరోజు ఈ ప్లేస్‌లో ఉంటామ‌ని ఐదేళ్ళ క్రితం మేం ఉహించ‌లేదు. బాహుబ‌లి సినిమా నేష‌న‌ల్ బ్రాండ్ అయ్యింది. గొప్ప పేరు వ‌చ్చింది. బాహుబ‌లి 2 సినిమా ఇండియ‌న్ సినిమాలో ఏ సినిమా విడుద‌ల కానంత గొప్ప రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. బాహుబ‌లి ప‌స్త‌కాలు, కామిక్స్‌, యానిమేష‌న్ రూపంలో విడుద‌లై ఆద‌ర‌ణ పొందాయి.రాజ‌మౌళిగారు ..సుప్రీం టాలెంట్ ఉన్న వ్య‌క్తి. హార్డ్ వ‌ర్క్ చేసే వ్య‌క్తి, ఆయ‌న సినీ జ‌ర్నీలో డ‌బ్బు ప్ర‌ధానంగా చూసుకోలేదు. ఈ మూడు విష‌యాలు కార‌ణంగానే బాహుబ‌లి అంత గొప్ప సినిమా చేయ‌గ‌లిగాను. ఆయ‌న లేకుండా ఈ సినిమాకు సంబంధించి చిన్న విష‌యం కూడా సాధ్యం కాలేదు. ప్ర‌భాస్ త‌న కెరీర్‌లో నాలుగేళ్లు స‌మ‌యాన్ని వెచ్చించాడు. అలాగే రానా ఈ సినిమాను బాలీవుడ్ రేంజ్‌కు చేరుకునేలా చేశాడు. ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌, అనుష్క‌, త‌మ‌న్నా అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. క‌ర‌ణ్‌జోహార్‌గారిని రానాతో వెళ్ళి క‌లిశాం. ఆయ‌న మాపై న‌మ్మ‌కంతో మాకు స‌పోర్ట్ చేశారు. ఐధేళ్ళుగా కొన్ని వంద‌ల మంది ప్యాష‌న్‌తో చేయ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి సినిమా చేయ‌గ‌లిగాం. అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.

ప్యాష‌న్‌, హార్డ్ వ‌ర్క్‌తో బాహుబ‌లి సాధ్య‌మైంది

ప్ర‌సాద్ దేవినేని మాట్లాడుతూ..ప్ర‌తి ఒక్క‌రి ప్యాష‌న్‌, హార్డ్ వ‌ర్క్‌తో బాహుబ‌లి వంటి గొప్ప సినిమా సాధ్య‌మ‌య్యేది కాదు. శోభు నిర్మాత‌గా ఎంతో ప్యాష‌న్‌తో నాకు ఎంతో అండ‌గా నిల‌బ‌డ్డాడు అన్నారు.

నిర్మాత‌లే రియ‌ల్ హీరోస్‌…

రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ…ఐదేళ్ళ క్రితం ఈ జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. ఐదేళ్ళ క్రితం రాజ‌మౌళి, నాన్న‌గారు ప్ర‌భాస్‌తో నేను సినిమా చేయాల‌నుకుంటున్నాను. నా కోసం ఒక క‌థ రాయండి అన్నాడు. ఎలాంటి క‌థ అని నేను అడిగితే..మీకు తెలుసు క‌దా..నాకు ఫైట్స్ అంటే ఇష్టం. ఫైట్స్ ఉండాలి. ఎమోష‌నల్ క‌థ అయ్యుండాలి. అది రాజుల క‌థ అయ్యుండాలి అన్నాడు. అలాగే ప‌వ‌ర్‌ఫుల్ లేడీ క్యారెక్ట‌ర్స్ ఉండాలి. గ్రే క్యారెక్ట‌ర్స్ ఉండాలనే కండిష‌న్స్ పెట్టాడు. మూడు రోజుల త‌ర్వాత క‌ట్ట‌ప్ప క్యారెక్ట‌ర్ గురించి చెప్పాను. మూడు రోజుల త‌ర్వాత ఓ త‌ల్లి న‌దిలో బిడ్డ‌ను పెట్టుకుని ఈదుతుంది. త‌న వ‌ల్ల కాకుండా పిల్ల‌వాడిని కాపాడుతూ చ‌నిపోయే సీన్ చెప్పాను. అలా సీన్స్ రాసుకుంటూ క‌థ త‌యారు చేశాను. మూడు నాలుగు మాసాల్లో క‌థ త‌యారైంది. అయితే ఈ క‌థ‌ను సాకారం అయ్యిందంటే దానికి కార‌ణం ఇద్ద‌రు వ్య‌క్తులు. అందులో ఒక‌రు ప్ర‌భాస్ ఐదేళ్ళు ఒకే సినిమా కోసం ప‌నిచేశాడు. ఈ ఐదేళ్ళ‌లో వేరే సినిమాలేవైనా చేసుంటే కోట్ల రూపాయ‌లు సంపాదించి ఉండేవాడు. త‌ను డ‌బ్బు, పేరు గురించి చూడ‌కుండా సినిమాపై న‌మ్మ‌కంతో, ప‌ట్టుద‌ల‌తో సినిమా చేశాడు. అందుకు త‌న‌కు థాంక్స్‌. అలాగే ఇక రెండో వ్య‌క్తి ప్ర‌భాస్‌కు ఈ సినిమాపై న‌మ్మ‌కాన్ని ఇచ్చింది డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. ప్ర‌భాస్‌కే కాదు…త‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న‌వారంద‌రికీ ఈ సినిమా గొప్ దృశ్య‌కావ్యం రాబోతుంద‌ని చెప్పి అంద‌రితో ప‌నిచేయించాడు. అది రాజ‌మౌళి గొప్ప‌త‌నం. రాజ‌మౌళి, ప్ర‌భాస్‌లు త‌మ‌కు వ‌చ్చిన కూలీ కంటే ఎక్కువ ప‌నిచేశారు. ఈ సినిమా కోసం బాహుబ‌లి, ప్ర‌భాస్‌లు ఏక సినిమా వ్ర‌తం చేశారు. ఇలాంటి గొప్ప సినిమా చేయాలంటే మంచి నిర్మాత‌లు కావాలి. శోభుగారు, దేవినేని ప్ర‌సాద్‌గారు న‌మ్మ‌కంతో యాబై, వంద కాదు..రెండు వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఏ రోజు వారిలో భ‌యం, అతృత చూడ‌లేదు. చిరున‌వ్వునే చూశాను. ఇలాంటి నిర్మాత‌ల కోసం ఇండ‌స్ట్రీ ఎదురుచూస్తుంది. నిర్మాత‌లే ఈ సినిమాకు రియ‌ల్ హీరోస్‌. నాగిరెడ్డి, చ‌క్ర‌పాణిల్లా ఈ నిర్మాత‌లు ఎన్నో గొప్ప సినిమాలు తీయాల‌ని, చ‌రిత్ర‌లో గొప్ప పేరుండాల‌ని మ‌న‌సా వాచా కోరుకుంటున్నాను అని చెప్పారు.

రాజ‌మౌళి ఇంకా ఎత్తుకు ఎద‌గాలి

ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ .. రాఘ‌వేంద్ర‌రావుగారు నా గాడ్‌ఫాద‌ర్‌, కృష్ణంరాజుగారు నా తండ్రిలాంటివారు. వీరంద‌రి ఇచ్చిన స‌పోర్ట్‌తో ఈ స్టేజ్‌పై నిల‌బ‌డగ‌లిగాను. అంత‌ర్జాతీయ ఖ్యాతి గ‌డించిన బాహుబ‌లి సినిమాలో మ్యూజిక్ చేయ‌డ‌మే కాదు, పాట‌లు రాసి, పాడే అవ‌కాశం కూడా వ‌చ్చింది. త‌మ్ముణ్ణి పొగ‌డ‌కూడదు..దీవించాలి. రాజ‌మౌళి ఇంకా ఎత్తుకు ఎద‌గాలి. వై క‌ట్ట‌ప్ప కిల్‌డ్ బాహ‌బ‌లి అనే ప్ర‌శ్న‌లోని వై అనేదాని ట్యూన్‌తో ట్రైల‌ర్ చేద్దామ‌నుకున్నాం. ఇక్క‌డ వై అనేది ప్ర‌శ్న కాదు..హౌ అనేదే ప్ర‌శ్న‌..నిర్మాత‌లు శోభు, ప్ర‌సాద్‌గారు ఈ సినిమాను ఎలా చేయ‌గ‌లిగారు. పిచ్చి జోకులు వేసే ర‌మ్య‌కృష్ణ‌గారు శివ‌గామిలాంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర ఎలా చేయ‌గ‌లిగింది..అనుష్క దేవ‌సేన‌లా ఎలా న‌టించింది..ప్ర‌భాస్‌లో గ‌ర్వం లేదు, మంచి మ‌న‌సున్న హీరో. ఇలాంటి హౌ అనే ప్ర‌శ్న‌లు చాలా ఉన్నాయి. నా వైఫ్ ఐదేళ్ళుగా ఉద‌యం ఐదు గంట‌ల‌కు ఫిలింసిటీకి వెళ్ళి, ఈ సినిమాలో ఎలా భాగం పంచుకుంది. జెమిని, జీవ‌న్‌, దినేష్‌లు మ్యూజిక్‌లో ఎంతో స‌హ‌కారం అందించారు అన్నారు.

బాహుబ‌లి గురించి ప్ర‌పంచం అంతా మాట్లాడుతుంది

సిినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ మాట్లాడుతూ – “ఈ రోజు ప్ర‌పంచమంతా బాహుబ‌లి సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు నాకెంతో గ‌ర్వంగా ఉంది.నేను సినిమాటోగ్రఫీ కోర్సు చేస్తున్నప్పుడు మాకేవేవో సినిమాలు చూపించేవారు. అందులో బెంగాళీ, హిందీ, మ‌రాఠీ ఇలా ప‌లు భాషా చిత్రాలు ఉండేవి కానీ తెలుగు సినిమా గురించి మాట్లాడేవారు కాదు. కానీ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిగారికి హ్యాట్సాఫ్‌. రాజ‌మౌళిగారు ఇలాగే వెళుతుంటే రాజ‌మౌళిని జేమ్స్ కామెరూన్ ఆఫ్ టాలీవుడ్ అని కాకుండా..జేమ్స్ కామెరూన్ ఆఫ్ హాలీవుడ్ అని పిలుస్తారు. శోభు, ప్ర‌సాద్‌గారు త‌ప్ప మ‌రే నిర్మాత‌లు ధైర్యం చేయలేరు. ఐప్ర‌భాస్ ఇప్పుడు ఇండియాలోనే పెద్ద స్టార్‌. త‌ను చాలా గొప్ప వ్య‌క్తి. త‌న‌తో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా ఫీలవుతున్నాను. నాకు స‌పోర్ట్ చేసిన నా టీం మెంబ‌ర్స్‌కు థాంక్స్‌“ అన్నారు.

రాజ‌మౌళితో వ‌ర్క్ చేయ‌డం పెద్ద గౌర‌వం

సీజీ వ‌ర్క్ సూప‌ర్‌వైజ‌ర్ క‌మ‌ల క‌న్న‌న్ మాట్లాడుతూ – “నేను చేసిన సినిమాల్లో బ‌హుబ‌లి కంటే నాకు పెద్ద సినిమా క‌న‌ప‌డ‌లేదు. నా బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాను. దేశంలోని అన్నీ విఎఫెక్స్ టీంలు బాహుబ‌లి కోసం ప‌నిచేశాయి. సెంథిల్ అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చాడు. సాబు సిరిల్ వంటి లెజెండ్‌తో వ‌ర్క్ చేశాను. శోభు, దేవినేని ఒక టైం త‌ప్ప‌, ఏమ‌డిగినా అది ఇచ్చారు. సై నుండి బాహుబ‌లి వ‌ర‌కు నేను రాజ‌మౌళితో వ‌ర్క్ చేసిన ఏడ‌వ సినిమా ఇది.త‌న‌తో వ‌ర్క్ చేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. అద్భుత‌మైన స్క్రిప్ట్‌. ప్ర‌తి స‌న్నివేశం హార్ట్ ట‌చింగ్‌గా ఉంటుంది. నాకు స‌పోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్‌“ అన్నారు.
బాహుబ‌లిలో భాగ‌మైనందుకు అదృష్టంగా బావిస్తున్నాను
ర‌మ్య‌కృష్ణ మాట్లాడుతూ – “బాహుబ‌లి గురించి ఎంత మాట్లాడినా త‌క్కువే. రాఘవేంద్రరావు, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు, రాజ‌మౌళిగారు, ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా స‌హా అంద‌రికీ థాంక్స్‌. డైరెక్ట‌ర్ విజ‌న్‌ను న‌మ్ముకుని ఐదేళ్ళు వ‌ర్క్ చేయ‌డం నా కెరీర్‌లో చూడ‌లేదు. ఇంత గొప్ప సినిమాలో పార్ట్ అయినంద‌కు అదృష్టంగా భావిస్తున్నాను“ అన్నారు.

బాహుబ‌లి అరుదైన సినిమా

నాజ‌ర్ మాట్లాడుతూ – “అరుదుగా ల‌భించే అనుభూతి బాహుబ‌లి. ఈ సినిమాతో గొప్ప క‌ల‌ను నిజం చేశారు. ఖ‌ర్చుతోనో, క‌లెక్ష‌న్స్‌తోనో ఒక సినిమాను గొప్ప సినిమా అని చెప్ప‌లేం. నాకు తెలిసినంత వ‌ర‌కు ఒక గొప్ప ఫీలింగ్‌ను ఇచ్చే సినిమాను గ్రేట్, బిగ్‌ ఫిలిం అంటాం. ఈ సినిమాలో రాజమౌళితో ప‌నిచేయ‌డం వ‌ల్ల గొప్ప పాఠం నేర్చుకున్నాను. గొప్ప ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చారు. ఇదొక బెంచ్ మార్క్ మూవీగా నిలిచిపోతుంది“ అన్నారు.

బాహుబ‌లితో క‌ట్ట‌ప్పగా మారిపోయాను

స‌త్య‌రాజ్ మాట్లాడుతూ..బాహుబ‌లిలో నేను బాగం కావ‌డం గ‌ర్వంగా భావిస్తున్నాను. నా నల‌బై ఏళ్ళ కెరీర్‌లో 250 సినిమాలకు పైగా న‌టించాను. ఈ సినిమాతో త‌మిళ‌నాడు స‌హా ఇండియా అంతా నా పేరు క‌ట్ట‌ప్ప‌గా మారింది. రాజ‌మౌళిగారికి థాంక్స్‌. శోభు, ప్ర‌సాద్‌, శ్రీవ‌ల్లీ, ర‌మాగారు, ప్ర‌భాస్‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స‌హా అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.

బాహుబ‌లి..వ‌న్స్ ఇన్ లైఫ్ టైం మూవీ

త‌మ‌న్నా మాట్లాడుతూ..నేను ఎక్క‌డికి వెళ్ళినా న‌న్ను తెలుగు అమ్మాయిలానే చూస్తారు. తెలుగు ప్రేక్ష‌కులు న‌న్నంత‌గా ఆద‌రించారు. ఎక్క‌డికి వెళ్ళినా..నాకు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఒక న‌టికి ఇంత ఆద‌ర‌ణ వ‌స్తుంద‌ని ఉహించ‌లేదు.బాహుబ‌లి వ‌న్స్ ఇన్ లైఫ్ టైం మూవీ. ఈ అవ‌కాశం ఇచ్చిన ప్ర‌భాస్‌, స్వీటి, రానా, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌, సాబుసిరిల్, వ‌ల్లీ, ర‌మా రాజ‌మౌళిగారు స‌హా అంద‌రికీ థాంక్స్ అని చెప్పారు.

ఐదేళ్ళ జ‌ర్నీని మ‌ర‌చిపోలేను

అనుష్క మాట్లాడుతూ…`రాజ‌మౌళిగారికి నా కెరీర్ ముందు నుండి నేనెంటో తెలుసు. దేవ‌సేన‌లాంటి ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో న‌న్ను ఎంపిక చేసుకున్నందుకు రాజ‌మౌళిగారికి థాంక్స్‌. శోభుగారు, ప్ర‌సాద్ దేవినేని, ర‌మాగారు, వ‌ల్లీగారు స‌హా స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. ప్ర‌భాస్‌, రానా, ర‌మ్య‌కృష్ణ స‌హా అంద‌రి మ‌ధ్య ఈ ఐదేళ్ళ జ‌ర్నీ అనుబంధం ఎంత‌గానో పెంచింది. రాజ‌మౌళిగారి ఫ్యామిలీ నాకెంతో ప్రత్యేకం. వారి ఎఫ‌ర్ట్ చేయ‌డ‌మే కాదు, సినిమాలో ప్ర‌తి చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో న‌మ్మ‌కాన్ని క‌లిగించారు“ అన్నారు.

బాహుబ‌లి..క‌ల‌కాలం నిలిచిపోయే చిత్రం

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ – “బాహుబ‌లి క‌ల‌కాలం నిలిచిపోయే చిత్ర‌మ‌ని నేను ముందుగానే చెప్పాను. బాహుబ‌లి అనే చిత్రం ఏప్రిల్ 28 గొప్ప పండుగ ఉంటుంది. ఆ రోజు వ‌ర‌కు నేను క‌న‌ప‌డ్డ ప్ర‌తి ఒక్క‌రికీ మ‌హిష్మ‌తి రాజ్యంలో మేమెలా గడిపామో చెబుతాను. నాకు ప్ర‌తి క్ష‌ణం జీవితాంతం గుర్తుండిపోతుంది. జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా ప్ర‌భాస్ నా ఫేవ‌రేట్ కోస్టార్‌. ఇది గ‌ర్వంగా చెప్పే మాట‌లైతే. మ‌హిష్మ‌తి రాజ్యాన్ని మ‌ళ్ళీ చూడ‌లేనేమోన‌ని బాధ‌గా ఉంది. భ‌ళ్ళాల దేవుడుగా న‌న్ను గొప్ప‌గా చూపించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిగారికి థాంక్స్‌. ఈ సినిమాలో ప‌నిచేసిన అంద‌రితో మ‌ళ్ళీ మ‌ళ్ళీ ప‌నిచేయాల‌నుకుంటున్నాను. ఏప్రిల్ 28 తారీఖు వేడుక‌కు సిద్ధమా…సాహోరే బాహుబ‌లి“ అన్నారు.