మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”.”దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం” లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రమిది. పద్మశ్రీ డా.మోహన్ బాబు జన్మదినం నేడు (మార్చి 19న) ఈ చిత్ర ప్రారంభోత్సవం తిరుపతిలో సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

మంచు విష్ణు-బ్రహ్మానందంలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కళాబంధు సుబ్బిరామిరెడ్డి క్లాప్ కొట్టగా.. రాజకీయవేత్త రఘురామరాజు కెమెరా స్వీచ్చాన్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “మల్లాది వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ విశేషంగా అలరిస్తుంది. మోహన్ బాబుగారి పుట్టినరోజున మా సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలవుతుంది” అన్నారు.

ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: వెంకట్, డ్యాన్స్: ప్రేమ్ రక్షిత్-దినేష్-గణేష్, కాస్ట్యూమ్స్: నరసింహ, లిరిక్స్: భాస్కరభట్ల, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, స్టిల్స్: రాజు, మాటలు: డార్లింగ్ స్వామి, స్క్రీన్ ప్లే: విక్రమ్ రాజ్-నివాస్-వర్మ, సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!