సినీ పరిశ్రమ ప్రముఖుడు, నిర్మాత శ్రీ దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించారనే సమాచారాన్ని విదేశాలలో కాటమరాయుడు షూటింగులో విని నమ్మలేకపోయాను. ఈ వార్త నిజం కాకూడదని అనుకున్నాను.ఎందుకంటే శ్రీ రాజు,అనితలది అంత అన్యోన్యమైన దాంపత్యం.నాకు శ్రీ దిల్ రాజు సినీ పరిశ్రమలో ఉన్న కొందరు ఆత్మీయుల్లో ముఖ్యమైన వ్యక్తి. అటువంటి ఆత్మీయ వ్యక్తికి ఇంతటి కష్టం రావడం నా మనసును ఎంతో కలచివేస్తోంది.శ్రీ దిల్ రాజు నిర్మించే చాల చిత్రాలకు శ్రీమతి అనిత సమర్పకురాలిగా ఉండేవారు. ఆలా ఆమెకు కుడా సినీ పరిశ్రమతో సంబంధ భాంధవ్యాలు వున్నాయి . నాలుగున్నర పదుల వయస్సులోనే ఆమె అకాల మరణం చెందడం శ్రీ రాజు కుటుంబానికి తీరని లోటు.
వూహించని ఈ విపత్తును తట్టుకోడానికి శ్రీ రాజుకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని,శ్రీమతి అనిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను,

– పవన్ కళ్యాణ్