ఫ్యాక్ష‌నిస్ట్ అంటే క‌త్తికి ఎదురెళ్లాలి!! అవ‌త‌ల ఎంత‌మందున్నార‌న్న‌ది ముఖ్యం కాదు.. ఎవ‌డున్నాడ‌న్న‌దే ముఖ్యం ..!! .. ఇదీ కాట‌మ‌రాయుడు స్టైల్‌. ట్రైల‌ర్ చూడ‌గానే అంద‌రికీ అర్థమైన మ్యాట‌ర్ కూడా ఇది. ఈసారి ప‌వ‌ర్‌స్టార్ గురి సూటిగా మాస్‌పైనే ఉంద‌ని ట్రైల‌ర్ చూడ‌గానే చెప్పేయొచ్చు. `గ‌బ్బ‌ర్‌సింగ్` త‌ర్వాత మ‌రో గ‌బ్బ‌ర్‌సింగ్‌ని ట్రై చేసినా గురి కుద‌ర‌లేదు. అందుకే ఆ క‌సితో ఇప్పుడు `కాట‌మ‌రాయుడు`గా వ‌స్తున్నాడు ప‌వ‌ర్‌స్టార్‌.

అవ‌త‌ల ఎంత‌మందున్నార‌న్న‌ది ముఖ్యం కాదు.. ఎవ‌డున్నాడ‌న్న‌దే ముఖ్యం ..!! అంటూ కాట‌మ‌రాయుడు టీజ‌ర్‌లో విసిరిన పంచ్ అదిరిపోయింది. పంచె ఎగ్గ‌ట్టి కత్తికి ఎదురెళ్లేవాడే కాట‌మ‌రాయుడు అని టీజ‌ర్ చూడ‌గానే అర్థ‌మైంది. `కాట‌మ‌రాయుడు`లో పంచెక‌ట్టు ఫ్యాక్ష‌న్ లీడ‌ర్‌గా క‌నిపిస్తున్న ప‌వ‌న్ ఈసారి అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌మాట‌!

ఈ క్రేజీ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ వారంలోనే షూటింగ్ పూర్తి కానుంది. బ్యాలెన్స్ రెండు పాట‌లు చిత్రీక‌రించి, సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేయ‌నున్నారు. మార్చి 28న సినిమా రిలీజ్ కానుంది. చిత్ర నిర్మాత శ‌ర‌త్‌మ‌రార్ ట్రైల‌ర్‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.