నాటి ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధం, అందులో విశాఖ‌ప‌ట్నం పాత్ర‌, సబ్‌మెరైన్‌ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఘాజి’. రానా హీరోగా న‌టించిన ఈ సినిమాలో తాప్సీక‌థానాయిక‌. కెకె మీనన్‌, ఓంపురి, సత్యదేవ్‌, నాజర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా ఈనెల 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.

తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్‌ క్లీన్‌ యూ సర్టిఫికెట్ ఇచ్చి ప్ర‌శంసించింది. ఈ చిత్రానికి అమితాబ్‌,
చిరంజీవి, సూర్య లాంటి స్టార్‌ హీరోలు ఆయా భాష‌ల్లో వాయిస్‌ అందించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా రిలీజ‌వుతోంది.