ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `బాహుబ‌లి- 2` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి: ది క‌న్‌క్లూజన్ టాకీ పార్ట్ పూర్తి చేసుకుని, ప్ర‌స్తుతం విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తున్నారు. ఏప్రిల్ 28 రిలీజ్ తేదీని ఇదివ‌ర‌కే చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. అంటే ఇంకో మూడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈలోగానే గ్రాఫిక్స్ వ‌ర్క్స్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి రిలీజ్‌కి రెడీ చేయాల్సి ఉంటుంది. ఆ ప‌నుల్లో జ‌క్క‌న్న పూర్తి బిజీగా ఉన్నారు. మ‌రోవైపు బాహుబ‌లి -2 ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల కోసం ర‌క‌ర‌కాల ప్లానింగ్స్‌లో ఉన్నారు రాజ‌మౌళి.

ఇప్ప‌టికి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, అటుపై కామిక్స్ పేరుతో ప్ర‌మోష‌న్‌ త‌ప్ప వేరే ప్ర‌మోష‌న్ లేదు. క‌ట్ట‌ప్ప అమ‌రేంద్ర బాహుబ‌లిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడో ఇంత‌వ‌ర‌కూ ఇసుమంత క్లూ కూడా ఇవ్వ‌లేదు. ఈరోజు రిప‌బ్లిక్‌డే సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్ల‌ను లాంచ్ చేశారు. ఒక‌టి `మాహిష్మ‌తి సామ్రాజ్యం` ఏరియ‌ల్ వ్యూ, వేరొక‌టి ప్ర‌భాస్‌- అనుష్క (బాహుబ‌లి – దేవ‌సేన‌) విల్లంబులు అందుకుని ప్ర‌తిభాపాఠ‌వం చూపిస్తున్న పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు.