మెగాస్టార్ చిరంజీవి, రోజా ప్రస్తుతం రాజకీయపరంగా వేర్వేరు దారుల్లో ఉన్నప్పటికీ సినీ రంగ పరంగా ‘ముఠా మేస్త్రి’, ‘ముగ్గురు మొనగాళ్లు’ వంటి సూపర్ హిట్ సినిమాలకి కలిసి పని చేశారు. చాలా రోజులకి మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి కనిపించనున్నారు. మెగాస్టార్ 150 వ సినిమాగా ‘ఖైదీ నెంబర్ 150 ‘ తో రీ ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ‘సాక్షి టీ.వి’ తరపున రోజా చిరంజీవి ని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంలో తీసిన ఫోటో ఇది. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవుతుంది.