‘వైశాఖం’ అందరికీ ఓ రెఫరెన్స్‌ మూవీ అవుతుంది – డైరెక్టర్‌ జయ.బి

0
424

జర్నలిస్ట్‌గా, రచయితగా, డైరెక్టర్‌గా తనకంటూ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న డైరెక్టర్‌జయ.బి, చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌ లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. ప్ర‌స్తుతం జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’  సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. జ‌య‌.బి పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 11. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…ఈ సందర్భంగా జయ.బి మాట్లాడుతూ –

”లవ్‌లీ’ సినిమా తర్వాత మా ఆర్‌.జె.సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందించిన సినిమా ‘వైశాఖం’. లవ్‌లీ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని చేసిన సినిమా ఇది. గ్యాప్‌ తీసుకోవడానికి కారణం కథ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను చేయడమే కారణం. అందుకోసం ఒక సంవత్సరం టైం తీసుకున్నాను. ఈ సినిమాలో నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరూ ఇష్టపడి చేశారు. సినిమా అవుట్‌పుట్‌ చూసిన యూనిట్‌ అందరూ సినిమా చాలా బాగా వచ్చిందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కొత్తవాళ్ళతో సినిమా చేసి అనుకున్న అవుట్‌పుట్‌ రాబట్టుకోవడానికి సమయం పడుతుంది. అయితే కథ పరంగా హీరో హారీష్‌, హీరోయిన్‌ అవంతిక పాత్రలకు పక్కాగా సూట్‌ అయ్యారు. పాటలు విజువల్‌గా బావుండాలని ముందుగానే అనుకున్నాను. లవ్‌ లీ సినిమా సాంగ్స్‌ను టర్కీలో షూట్‌ చేశాం. ఈసారి ఏదైనా కొత్త లోకేషన్‌ కావాలనుకున్నప్పుడు, అందరూ అన్ని దేశాల్లో షూట్‌ చేస్తున్నారు. ఎక్కడైనా కొత్త ప్రదేశంలో సాంగ్స్‌ షూట్‌ చేయాలని కజికిస్థాన్‌లో లోకేషన్స్‌ చూశాం. తెలుగు సినిమాలోనే కాదు, ఇప్పటి వరకు అక్కడ మరే సినిమా షూటింగ్‌ కూడా జరగలేదు. కజికిస్థాన్‌లో మూడు సాంగ్స్‌ను షూట్‌ చేశాం. ఇక సినిమా విషయానికి వస్తే అపార్ట్‌మెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. కాబట్టి ఎక్కువ మంది ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. కథ విషయానికి వస్తే హీరో ఉండే అపార్ట్‌మెంట్‌లోకి హీరోయిన్‌ ఓ ఉద్దేశంతో వస్తుంది, హీరోను ఎలా మార్చిందనేదే కథ. ఈ సినిమాలో రమాప్రభ, సాయికుమార్‌ క్యారెక్టర్స్‌ అందరికీ నచ్చుతాయి. పృథ్వీ క్యారెక్టర్‌ కామెడిగా ఉంటూ కథలో భాగంగా సాగుతుంది. లవ్‌లీ మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన తర్వాత అదే మ్యూజిక్‌ డైరెక్టర్‌ను కంటిన్యూ చేయాలనుకున్నాం. ఓరోజు డి.జె.వసంత్‌ నన్ను కలిసి తన చేసిన కొన్ని ట్యూన్స్‌ను వినిపించాడు. ట్యూన్స్‌ నచ్చాయి. అలాగే తనకు మ్యూజిక్‌లో మంచి అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలనుకుని వసంత్‌కు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాం. ఈ సినిమాలో వెంకట సుబ్బారావుగారు సినిమాటోగ్రఫీ కూడా ప్లస్‌ అవుతుంది. నా లైఫ్‌లో జరిగిన ఇన్‌సిడెంట్‌ ఆధారంగా కథను తయారు చేసుకున్నాను. మా బ్యానర్‌లో వచ్చిన చంటిగాడు, గుండమ్మగారి మనవుడు, లవ్‌లీ సినిమాలు బయ్యర్స్‌కు లాభాలను తెచ్చి పెట్టడం, బిజినెస్‌ పరంగా మంచి క్రేజ్‌ నెలకొంది. సినిమా అవుట్‌పుట్‌ ఎక్సలెంట్‌గా వచ్చింది.2017లో వైశాఖం డెఫనెట్‌గా హిట్‌ కావడమే కాదు, నెక్స్‌ట్‌ వచ్చే ఈ తరహా జోనర్‌ సినిమాలకు రెఫరెన్స్‌ మూవీ అవుతుంది. వచ్చే నెల ఆడియో విడుదల చేసి వేసవిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here