మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ జనవరి 11న విడుదలకి సిద్ధం అవుతుండగానే ఆయన తర్వాతి ప్రోజెక్టుల గురించి చిరంజీవి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఖైదీ నెంబర్ 150’ కి పని చేసిన పరుచూరి బ్రదర్స్ మరో సారి చిరంజీవి కోసం ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్ట్ ఖరారు అయ్యాక పూర్తి వివరాలు ఫైనలైజ్ అవుతాయి. రామ్ చరణ్ తో ‘ధ్రువ’ తీసిన సురేందర్ రెడ్డి కూడా చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇక తన 152 వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్నట్టు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.