మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ గా వస్తున్న 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ విడుదల హంగామా మొదలైపోయింది. జనవరి 11 న ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కోలాహలం మధ్య విడుదలకి సిద్ధం అవుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్ మీద మొదటి సినిమాగా ‘ఖైదీ నెంబర్ 150’ నిర్మించారు. నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ వేడుక లో కూడా తాను ఇప్పటి వరకు పని చేసిన అగ్ర నిర్మాతల సరసన చరణ్ కూడా ఉంటాడని, నిర్మాత గా అంత సమర్ధవంతంగా ‘ఖైదీ నెంబర్ 150 ‘ ని తెరకెక్కించాడని స్వయంగా చిరంజీవే అభినందించడం విశేషం. ఇక చిరు తదుపరి చిత్రం ఎవరితో అనే ప్రశ్నకి, తన 151 వ చిత్రం కూడా ‘కొణిదెల ప్రొడక్షన్స్’ లో  రామ్ చరణే నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలుస్తాయి.