కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్…రాములమ్మ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో సంచలనం సృష్టించి లేడీ అమితాబ్ గా పేరొందిన ‘విశ్వ నట భారతి’ విజయశాంతి మళ్ళీ తెరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. ఒక భారీ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ జరగడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు వినిపిస్తోంది. యుద్ధ నేపథ్యంలో ఉండబోయే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ అయిదు భాషల్లో తెరకెక్కనుంది. మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ లా విజయశాంతి రీఎంట్రీ కూడా సంచలనం కానుందా ?