అక్కినేని అఖిల్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేయ‌బోతున్నాడు. తొలి సినిమా ‘అఖిల్’ త‌ర్వాత గ్యాప్ తీసుకున్న అఖిల్ 13బి, ఇష్క్ వంటి చిత్రాల‌తో పాటు అక్కినేని ఫ్యామిలీ చిత్రం ‘మ‌నం’ కూడా విజ‌య‌వంత‌మైన చిత్రంగా మ‌ల‌చ‌డంలో విక్ర‌మ్ కుమార్ పెద్ద స‌క్సెస్ అయ్యాడు. దీంతో అఖిల్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీకి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమా కోసం జిమ్‌లో అఖిల్ ఎక్స‌ర్ సైజ్‌లు మొద‌లెట్టాడు. విక్రమ్ కుమార్ సినిమా  కథానుసారం త‌న శ‌రీరం నుండి చాలా డిమాండ్ చేస్తుంద‌ని, స్పెష‌ల్ డైట్ తీసుకుని జిమ్ చేస్తున్నాన‌ని అఖిల్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళ్ల‌నుంది.