సూపర్ స్టార్ మహేష్, ఎ.అర్ మురుగదాస్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ జనవరి 8 నుండి. అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత పూణే,డయు లలో జరిగే షెడ్యూల్స్ తో సినిమా కంప్లీట్ చేసి సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఎన్.వీ ప్రసాద్, ‘ఠాగూర్’ మధు ప్లాన్ చేస్తున్నారు.

జనవరి చివరి వారంలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. తెలుగు,తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో, హై-టెక్నికల్ స్టాండర్డ్స్ తో నిర్మాణమవుతున్నఈ చిత్రం శాటిలైట్ హక్కులని ఫాన్సీ ఆఫర్ ఇచ్చి 26 కోట్ల కి జీ టీవీ స్వంతం చేసుకోవడం సరికొత్త రికార్డుగా టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది