పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ ‘వీరం’ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుంది. నేసన్ దర్శకత్వంలో ఏ.ఎం రత్నం బ్యానర్ లో ‘వేదాళం’ రీమేక్ కూడా ప్రారంభం అయింది. అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఒక యువ దర్శకుడు కథ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఆ దర్శకుడు ఎవరో కాదు తమిళం లో అజిత్ తో వరుస సూపర్ హిట్స్ ఇస్తున్న దర్శకుడు శివ .కెమరామెన్ నుండి దర్శకుడిగా ఎదిగిన శివ, అజిత్ తో ‘వీరం’ ‘వేదాళం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇప్పుడు హాట్-ట్రిక్ సినిమా తీసే పనిలో ఉన్నారు. శివ రెడీ చేస్తున్న సబ్జెక్టు కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతోందన్నమాటే. ఈ కాంబినేషన్ పవర్ స్టార్ అభిమానులకి ఒక స్పెషల్ కాంబినేషన్ అవుతుంది.