సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ రియ‌ల్ లైఫ్ స్టోరీస్ ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట‌. రియ‌ల్ లైఫ్ స్టోరీ ఎవ‌రిదైనా స‌రే ఇన్ స్పైయిర్ చేస్తే చాలు సినిమా తీసేస్తాడు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన యధార్ధ సంఘ‌ట‌న‌ల‌తో వంగ‌వీటి చిత్రాన్ని తెర‌కెక్కించిన వ‌ర్మ ఇప్పుడు జ‌య‌ల‌లిత పై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి శ‌శిక‌ళ అనే టైటిల్ పెట్టడం విశేషం.

ఈ విష‌యాన్ని వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ…ఇప్పుడు నా కొత్త సినిమా కోసం శ‌శిక‌ళ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేసాను అని తెలిపారు. అంతే కాకుండా ఇది ఇద్ద‌రి స్నేహితుల క‌థ‌. జ‌య‌ల‌లిత త‌న క‌ళ్ల‌తో క‌న్నా శ‌శిక‌ళ క‌ళ్ల‌తో లోకాన్ని చూసారు అని తెలియ‌చేసాడు వ‌ర్మ‌. ఈ ఇద్ద‌రి స్నేహితుల మ‌ధ్య విభేధాలు, శ‌శిక‌ళ జ‌య‌ను చంపే ప్ర‌య‌త్నం చేసార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌ర్మ శ‌శిక‌ళ సినిమా ద్వారా ఏం చెబుతారో…? వివాద‌స్ప‌ద‌మైన విష‌యాల‌ను సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేస్తారా లేదా అనేది ఆస‌క్తిగా మారింది. నిజంగానే శ‌శిక‌ళ సినిమా తీస్తారా..? లేక చాలా సినిమాలు వ‌లే ఈ చిత్రాన్ని కూడా ప్ర‌చారానికే ప‌రిమితం చేస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!