యంగ్ హీరోలు అంద‌రూ సినిమాల‌తో పాటు వారి ఇష్టాల‌ను ఫాలో అవుతూ వ్యాపార రంగంలోకి ఒక్కొక్కరుగా ఎంట‌ర్ అవుతున్నారు. ఇప్పుడు వీరి బాట‌లోకి హీరో సందీప్ కిష‌న్ చేరాడు. అతిథ్య రంగానికి చెందిన రెస్టారెంట్స్ వ్యాపారంలోకి ఎంట్రి ఇచ్చిన సందీప్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.10లో `వివాహా భోజ‌నంబు` అనే రెస్టారెంట్‌ను స్టార్ట్ చేస్తున్నాడు. డిసెంబ‌ర్ 15న ఈ రెస్టారెంట్ లాంచ‌నంగా ప్రారంభం కానుంది. ఈ రెస్టారెంట్‌లో తెలుగు వంట‌కాల‌ను స్పెష‌ల్‌గా అందించ‌నున్నారు.