అక్కినేని నాగార్జున‌, ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాదు, భ‌క్తిర‌స చిత్రాలు కూడా రూపొందాయి. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడిసాయి వంటి భ‌క్తి క‌థా చిత్రాలు వీరి కాంబోలోనే వ‌చ్చి సెన్సేష‌న‌ల్ హిట్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మ‌రో భ‌క్తిర‌స ప్ర‌ధాన చిత్రం `ఓం న‌మో వేంక‌టేశాయ‌`. వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడైన హ‌థీరాం బాబా జీవిత చ‌రిత్రపై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్ర శాటిలైట్ హ‌క్కుల‌ను ఈటీవీ తెలుగు చానెల్ ఫ్యాన్సీరేటు చెల్లించి దక్కించుకుంద‌ట‌.