తాజాగా అల్లు శిరీష్ ప్రేయ‌సిగా నిక్కి గ‌ల్రాని న‌టిస్తోంది. అల్లు శిరీష్ న‌టిస్తున్న వార్ డ్రామా 1971: బియాండ్ బార్డ‌ర్స్ లో ఆమె క‌థానాయిక‌గా ఎంపికైంది. మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. మేజ‌ర్ ర‌వి మాట్లాడుతూ “ఇందులో నిక్కి త‌మిళ అమ్మాయిగా న‌టిస్తోంది. జ‌న‌వ‌రిలో త‌న పోర్ష‌న్ ను పొల్లాచ్చిలో చిత్రీక‌రిస్తాం“ అని అన్నారు. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించే ఈ సినిమా గురించి నిక్కి మాట్లాడుతూ “నా చేతుల్లో ప్ర‌స్తుతం ఐదు త‌మిళ ప్రాజెక్టులున్నాయి. ఈ సినిమా గురించి చెప్పిన‌ప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మోహ‌న్‌లాల్‌గారి సినిమా అన‌గానే థ్రిల్ ఫీల‌య్యాను. ఇందులో అల్లు శిరీష్ ప‌క్క‌న న‌టించ‌డం ఆనందంగా ఉంది“ అని అన్నారు.