న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా తెర‌పై క‌న‌ప‌డ‌నున్నాడు. గతంలో అష్టాచమ్మాలో నానితో పాటు హీరోగా స్క్రీన్‌ను పంచుకున్న అవ‌స‌రాల త‌ర్వాత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తూనే, ఊహ‌లు గుస‌గుస‌లాడే, జ్యోఅచ్యుతానంద సినిమాల‌ను డైరెక్ట్ కూడా చేశాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో అడ‌ల్ట్ మూవీ హంట‌ర్‌తో పూర్తిస్థాయి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, తేజ‌స్వి మ‌దివాడ‌, శ్రీముఖి, సుప్రియ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుద‌లై మంచి స్పంద‌నను రాబ‌ట్టుకుంది. ఈ సినిమాకు వేట‌గాడు స‌హా ప‌లు టైటిల్స్ విన‌ప‌డ్డ‌ప్ప‌టికీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు ‘బాబు బాగా బిజీ’ అనే పేరును ఫిక్స్ అయిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచ‌రం రానుంది.