ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌క నిర్మాత అనీల్ సుంక‌ర ప‌లు చిత్రాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న స్నేహితుడు అభిషేక్ అగ‌ర్వాల్‌తో క‌లిసి మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లామ్ జీవిత చరిత్ర‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. 50 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ అవుతుంద‌ని, అందుక‌ని వీరితో పాటు సోనీ పిక్చ‌ర్స్ కూడా చేతులు క‌లిపే అవ‌కాశం ఉంద‌ట‌. ఎక్క‌డో మారుమూల ప్రాంతంలో పుట్టిన అబ్దుల్ క‌లామ్ చిన్న‌ప్పుడు పేద‌రికంతో బాధ‌ప‌డి, అనేక క‌ష్టాలు ప‌డి రాష్ట్ర‌ప‌తి స్థాయికి ఎదిగాడు. ఈ క్ర‌మాన్నే సినిమాగా రూపొందిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. మ‌రి ఇందులో రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లామ్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది…